20, డిసెంబర్ 2014, శనివారం

టెండర్


అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు.
ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400 డాలర్లు  పనివాళ్ళకు, 100 డాలర్లు  అతనికి లాభం.
తరువాత చైనీయుడి వంతు వచ్చింది. అతను కూడా ఏవో కొన్ని లెక్కలు వేసి 700 డాలర్లు లెక్క తేల్చాడు. 300డాలర్లు సామాగ్రికి, 300 పనివాళ్ళకు, 100 డాలర్లు లాభం.
చివరగా భారతీయుడి వంతు వచ్చింది. కొలతలు వేసే కార్యక్రమాలేమీ పెట్టుకోకుండా అధికార ప్రతినిథిని దగ్గరగా పిలిచి చెవిలో “2700 డాలర్లవుతుంది” అన్నాడు.
“నువ్వు వాళ్ళలాగా కనీసం కొలత కూడా వేయలేదు. అంత పెద్ద సంఖ్య ఎలా చెప్పావు?”
“1000 డాలర్లు నీకు , 1000 డాలర్లు నాకు, ఆ చైనా వాణ్ణి మనం పనిలో పెట్టుకుందాం. ఏమంటావ్?”
“Done”.

స్పేస్ షిప్

నాసా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన స్పేస్ షిప్ ని తయారు చేశారు. కానీ అంతరిక్షంలోకి పంపేందుకు ఆటంకం వచ్చింది. ఎంత ప్రయత్నించినా షటిల్ స్టార్ట్ అవ్వడంలేదు..
ఆఖరికి అక్కడ పనిచేస్తున్న జంబులింగం గారి పెద్దబ్బాయి సోమలింగం గారిని సహాయం చెయ్యమని అడిగారు.
సమస్యంతా విన్న సోమలింగం " షటిల్ ని 45 డిగ్రీల కోణంలో వంచి ప్రయోగించి చూడండి." అని సలహా ఇచ్చాడు. 
శాస్త్రవేత్తలు అలానే చేశారు.. అంతే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళిపోయింది. సైంటిస్టులు ఆనందం పట్టలేకపోయారు. 
"మీకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది." అని అడిగారు సోమలింగాన్ని .
"ఆ .. ఏముందీ.. మాదేశంలో స్కూటర్లు స్టార్ట్ కాకుంటే.. మావాళ్ళంతా చేసేది అదే కదా..!!" అసలు రహస్యం చెప్పాడు సోమలింగం. 

స్టెప్పు స్టెప్పుకు మార్కులు

క్లాసులో వార్షిక లెక్కల పరీక్ష జరుగుతోంది. రమేష్ మాటిమాటికి కూర్చున్న చోటినుంచి లేచి స్టెప్పులేసి
 కూర్చోవడం, ఏదో రాసి మళ్లీ లేచి స్టెప్స్ వేయడం తిరిగి కూర్చుని రాయడం చేస్తున్నాడు. ఇది గమనించిన
పరిశీలకుడు రమేష్‌ను లేపి మరీ ఎందుకలా గంతులేస్తున్నావు అని అడిగాడు.
'స్టెప్పు స్టెప్పుకు మార్కులుంటాయని ప్రశ్నాపత్రంలో ఇచ్చారు కద సార్' రొప్పుతూ అన్నాడు రమేష్

కాలేజ్ స్టూడెంట్స్

నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ అర్ద రాత్రి వరకు ఆడుకొని పరీక్షకు prepare అవకుండా పడుకుని తెల్లారి ఒక ఉపాయం ఆలోచిస్తారు.
తమ బట్టలకు బాగా దుమ్ము, గ్రీజు అంటించుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూండగా కారు పంక్చరైంది దాన్ని తోసుకుని హాస్టల్ కి వచ్చేసరికి తెల్లారింది. అందుకే చదవలేకపోయామని చెప్తారు.

ప్రిన్సిపాల్ సరే అని మూడు రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెడతానంటాడు. మూడురోజుల తర్వాత ఆ నలుగురిని తలా ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళకు Test పేపర్ ఇస్తారు.

ప్రశ్నా పత్రం
పరీక్ష ప్రశ్నా పత్రంలో వందమార్కులకు రెండు సమాధానాలు వ్రాయలి.

Q.1. నీ పేరు......................... (2 MARKS)

Q.2. కారు ఏ టైరు పంక్చరైంది? (98 మార్కులు)

a) Front Left b) Front Right
c) Back Left d) Back Right.....!!!

పెళ్ళికొడుకు

"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
"నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.

సింహం

Employee : సార్ మీరు మన ఆఫీస్ లో సింహం కదా, మరి ఇంట్లో ఎలా ఉంటారు, 
బాస్ : భలేవాడివే నేను ఇంట్లోనూ సింహంలానే ఉంటాను, కానీ దుర్గామాత సింహం మీద కూర్చొనుంటుందక్కడ.