25, ఆగస్టు 2012, శనివారం

మనం చేసే తప్పులకు అనుకులంగా శాస్త్రాలను ఉపయొగించకూడదు

మనం చేసే తప్పులకు అనుకులంగా శాస్త్రాలను ఉపయొగించకూడదు అని తెల్పుటకు చిన్ని కథ                                           

ఒకసారి నలుగురు పండితులు తీర్దయాత్రలకు బయలుదేరారు.తమకు కావలసిని ఆహరము సమకూర్చుకుని తమతోపాటు తీసుకువెళ్తారు .మిట్టమధ్యహాన్నం అయ్యేసరికి ఒక విశాలమైన చెట్టు నీడను చేరి భోజనాలు ముగించుకుని మళ్ళీ బయలుదేరవచ్చు అని అనుకున్నారు వారిలో ఒకడు ఆహరం స్వీకరంచడానికిముందు స్నానం  చేయాలని అన్నాడు వెంటనే వారు నలుగురులో   ఒకడిని ఇక్కడ కాపలా ఉంచి మిగతా ముగ్గురు  స్నానం చేయడానికి వెళ్ళారు.స్నానం చేయడానికి వెళ్ళీనవారు ఎంతసేపటకి రాకపొవడముతో కాపలా ఉన్నతనకి వీపరితముగా ఆకలి   అవటంవల్ల ఇక లాభం లేదు అనుకోని తాను తీసుకువచ్చిన మూటను విప్పి తినేశాడు.కానీ అప్పటకీ అతని ఆకలి చల్లారినట్లులేదు .ఇంకొకతని భోజనం కూడా తీనేశాడు ఇలా ముగ్గురి భోజనాలు ఇతడే  తినేసి,మంచి నిద్రలోకి జారుకున్నాడు.తరువాత స్నానం చేసి ముగ్గురు  తిరిగివచ్చి చూసేసరికి భోజనం మూటలు ఖాళీ అయ్యాయి. నిద్రపొతున్న వానిని లేపి అడిగితే 'అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాందేహమాశ్రిత:.. నేను వైశ్వానరుడు (జఠరాగ్ని )గా ఉంటు నాలుగువిధములైన ఆహరాలను జీర్ణిస్తూన్నాను అని  గీతలో భగవానుడు చెప్పిన శ్లోకాన్ని వల్లించాడు. ఆప్పటికే ఆకలితో ఉన్నాముగ్గురికి ఆ మాటలు చాలా కోపాన్ని కలిగించాయి కర్రలు తీసుకుని గొడ్డుని బాదినట్టు బాదుతు.'నైనం  ఛిన్దంతి  శస్త్రాణి నైనం దహతిపావకం ఈ ఆత్మను ఆయుధాలు ఖండించలేవు,అగ్ని దహించలేదు,నీరు తడపలేదూ' అనే గీతశ్లోకాన్ని ఉల్లేఖించారు.కేవలం శాస్త్ర పాండిత్యం మాత్రమే కలిగిఉన్న పండితుడు తనని వైశ్వానరునిగా పేర్కొన్నాడూ అందువల్ల మొదటివాడు వల్లించిన శాస్ర్త్రములనుండే వారు కూడా  శ్లోకములు ఉల్లేఖించి మంచి గుణపాఠం చెప్పారు.
     మన అవసరాలకు తగ్గట్టుగా విపరీత అర్ధాలు తీసుకునే వేదాంతం భగవంతుణ్ణి దర్శంచుకోవడానికి  పనికిరాదు.అనుభవజ్ఞానం మాత్రమే మనము  భగవంతుణ్ణి చేరుకోవడానికి తోడ్పడుతుంది.

చిన్ని కవిత:


 చిన్ని కవిత:


చందమామ కన్నా అపురూపం నీ రూపం ...
కోకిల కన్నా మధురం నీ పలుకు ...
నెమలి నాట్యం కన్నా అందం నీ నయనం
నీ అలికిడి వింటే అలజడే నా గుండెల్లో ...
నీ హృదయ అంతరంగాన్ని అందుకోగలనా ... నా చెలి ...