23, అక్టోబర్ 2014, గురువారం

దేవుడి మీద మీకున్న నమ్మకం ఏంటి?

మొత్తం ప్రపంచంలో జీవించే ప్రతిఒక్క జీవరాశికి కలిగే ఒక అసాధారణమైన ప్రశ్న..‘‘దేవుడు వున్నాడా? లేడా?’’. కొందరు దేవుడు వున్నాడని నమ్మి, ఆయనకు పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా రకరకాలైన ఆధ్మాత్మిక కార్యకలాపాలను నిర్వహించుకుంటారు. మరికొందరు దేవుడనేవాడు అస్సలు లేడని, జీవరాశి అనేది కేవలం ప్రకృతి రహస్యం అని అనుకుంటూ వుంటారు. మరికొంతమంది ఆనాటి కాలంలో ఎంతో ఆధ్యాత్మికంగా రూపొందించబడిన పురాణాలు, ఖురాన్ లు, బైబిలు, ఇంకా ఇతర దైవాలకు సంబంధించినవి కేవలం కట్టుకథలని, అవి కేవలం భ్రమ కలిగించడానికే రాయబడ్డారని అనుకునేవాళ్లూ వున్నారు. మరికొందరైతే.. సృష్టిలో నిర్మించబడ్డ ప్రతిఒక్క వస్తువు గురించి ఆలోచిస్తూ.. ‘‘ఇది ఎలా ఏర్పడింది? దీనికి సృష్టికర్త ఎవరు? ఇది పుట్టడానికి కారణమేంటి?’’ అనే ప్రశ్నలను వేసుకుంటూ దేవుడికి స్మరిస్తూ వుంటారు. అయితే ఇటువంటి ప్రశ్నలన్నింటినీ నిరూపించడానికి, రహస్యాలను ఛేదించడానికి ఎవ్వరి దగ్గర పరిశోధనాత్మకంగా కావలసిన మార్గాలు వుండవు... అస్సలు దొరకవు కూడా. మానవునిలో వుండే ఆత్మ, అది గ్రహించే శక్తి తయారుచేయడం సాధ్యం కాదు. అసలు అటువంటి ఆలోచనలు ఎవ్వరూ చేయలేరు కూడా. దేవుడు వున్నాడని చెప్పడానికి పరిశోధనలు చేయడం అవసరం లేదు... వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవడం అస్సలు అవసరం లేదు. మన చుట్టుపక్కల వున్న ప్రకృతిని, జీవరాసులను గ్రహిస్తే చాలు. దేవుడు విస్తృత సృష్టిలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్మించిన ఒక సుప్రీం అని ప్రతి ఒక్కరు నిర్వచిస్తారు. అతను నిర్మించిన మార్గాలన్నీ ఎంతో శక్తివంతమైనవి. అతనిని మాటలతో వివరించలేము. అతనిని అర్థం చేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో వున్న జీవరాసుల జీవితాలు సరిపోవు. దేవుడిని నమ్మేవారు ఆయన నిర్మించిన వాస్తవాలను నమ్ముతారు. నమ్మనివారు నిరూపించడానికి సాక్ష్యాన్ని కోరుకుంటారు. దేవుడు వున్నాడు అనే సాక్ష్యాన్ని ఇతరులను నిరూపించడం అసాధ్యం... అయితే దాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇందులో ఆ దేవుడు, అతని దైవం దాగి వుంది.

12, అక్టోబర్ 2014, ఆదివారం

అలంపూర్ జోగులాంల అమ్మవారి ఆలయం


ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి...

ఆలయ చరిత్ర

క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.

ఆలయ స్థల పురాణం

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.

ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.

hai friends.............................







jai sri ram.............


10, అక్టోబర్ 2014, శుక్రవారం

దేవుళ్లకు సంబంధించిన వాహనాలు

హిందూ సంస్కృతీ, సంప్రాదాయాల ప్రకారం ప్రాచీనకాలం నుండి కొన్ని జంతువులు, పక్షులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అదెలా అంటే... కొన్ని జంతువులు దేవుని రూపాలను కలిగి వుంటున్నాయి. మరికొన్ని జంతువులు, పక్షులు దేవుళ్లకు వాహనాలుగా వున్నాయి. ఇంకొన్ని సమయానుకూలంగా దేవుళ్లకు ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. వీటికి సంబంధించిన కొన్ని కథనాలు పురాణాలలో ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రకంగా చెప్పబడి వుంది కూడా! ఉదాహరణకు ఏనుగు జంతువు గణేషుడు రూపాన్ని కలిగి వుంది. అదేవిధంగా కోతి కూడా హనుమంతుడి రూపాన్ని కలిగి వుంది. అలాగే ఎలుక వినాయకుడికి ఒక వాహనంగా ఉపయోగపడింది. ఇలా రకరకాల జంతువులు రకరకాలుగా దేవుళ్లకు అందుబాటులో వుండడం వల్ల వీటికి చాలా ప్రాధాన్యత వుంది. హిందువులు జంతువులలో ఎంతో పవిత్రంగా, దైవంగా భావించే వాటిలో గోమాత ఒకటి. హిందూధర్మాల ప్రకారం పురాణాలలో గోమాత అన్ని దేవతలకు తల్లిగా భావిస్తారు. ఎవరైనా ఆవుపాలు దానం (గోదానం) చేస్తే.. ఆ కుటుంబంలో వున్నవారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పండితులు ఆ కాలంలోనే పేర్కొన్నారు. కొన్ని దేవాలయాలలో ఈ జంతువుల బొమ్మలు కూడా చెక్కబడి వుంటాయి. సాధారణ మానవులకు ఇవి కేవలం జంతువులుగా మాత్రమే తెలుసు. అయితే వీటిని ఎదురించడం వల్ల మనం నిర్వహించుకునే కొన్ని కార్యాలయాలలో అపజయం ఎదుర్కోవడం ఖాయమని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ జంతువుల ప్రత్యేకతలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..... ఎలుక : హిందు దేవుళ్లలో మొట్టమొదటగా ఆరాధించే దేవుడైన గణేషుడికి ఈ ఎలుక ఒక వాహనంలా ఉపయోగపడింది. అయితే ఇది వినాయకుని వాహనంగా పూజలు అందుకోవడం చాలా తక్కువ. చాలావరకు మానవులు దీనిని శత్రువుగా భావిస్తారు. ఎందుకంటే... ప్రస్తుతమున్న ఎలుకలు ఇంట్లో చాలా నష్టాలను కలిగిస్తున్నాయి కాబట్టి. ఎద్దు : ఇది బసవన్న లేదా నందిగా పిలవబడుతుంది. ఈ జంతువు శివుడికి సంరక్షకుడిగా, వాహనంగా ప్రసిద్ధి చెందినది. ప్రతి శివాలయం దగ్గర ఈ నంది విగ్రహం కొలువై వుంటుంది. పులి : హిందువులు ఎంతో ఆరాధ్యంగా, శక్తిగా, దుర్గగా పార్వతిదేవిని అర్చిస్తుంటారు. పులి పార్వతీదేవి వాహనం. నెమలి : హిందూ మతంలో చదువుల తల్లిగా సరస్వతీ దేవి ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. సరస్వతీ హంస వాహనంపై, మయూర వాహనంపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. నెమలి యజ్ఞశక్తికి సంకేతం. గుడ్లగూబ : హిందువుల సంప్రదాయం ప్రకారం సిరిసంపదలు, సౌభాగ్యం, సుఖసంతోషాలను కలుగజేసే లక్ష్మీమాతను ఎంతో దైవంగా ఆరాధిస్తారు. ఆ లక్ష్మీదేవి వాహనమే ఆ గుడ్లగూబ. హంస : బ్రహ్మదేవుని వాహనమే ఈ హంస. ఈ హంసలో పాలుని, నీటిని వేరు చేసే గుణం వుంటుంది. గరుడ (గ్రద్ద) : ఇది పక్షులన్నింటికీ అధిపతి. ఈ గద్దకు సంబంధించిన అష్టాదశ పురాణాలలో ఒకటైన గరుడ పురాణం కూడా వ్యాసమహర్షి చేత వ్రాయబడింది. ఇది శ్రీ మహావిష్ణువు వాహనం. ఏనుగు : ఏనుగు ఇంద్రుడి వాహనం. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారాలను సూచిస్తుంది. గణేశుడు కూడా ఈ ఏనుగు రూపాన్నే ధరించాడు. మొసలి : మొసలి వరణుడి వాహనం. వరుణుడిని నీటికి, ఆకాశానికి అధిపతిగా కొలిచేవారు. గుర్రం : గుర్రం ఆది దేవుడు లేదా సూర్యదేవుని వాహనం. ఇది ఏడు ఇంద్రధనస్సు రంగులను సూచిస్తుంది.

రామాయణం పఠించడం వల్ల కలిగే లాభాలు

ప్రాచీనకాలంలో దేవతల జీవన విధానం, వారు అనుసరించిన పద్ధతులకు సంబంధించిన పవిత్ర పురాణ గ్రంథాలు ఎన్నో వున్నాయి. వాటిని పఠించడంగానీ, వినడంగానీ చేస్తే... మన సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా... జీవితంలో వున్న కష్టాలు తొలగిపోయి, లాభాల పంటలు పండుతాయని ఆనాటి ఋషువులు పేర్కొన్నారు. అటువంటి పవిత్ర గ్రంథాల్లో వాల్మీకి రచించిన రామాయణం ఎంతో మహోన్నతమైంది. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం... హిందూ చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగి వుంది. అందులో వున్న పాత్రల ద్వారా మంచి-చెడు మధ్య భేదాలు, ఆదర్శ జీవిన విధానం, గౌరవ-అగౌరవాలు వంటి విషయాలను ఎన్నో నేర్చుకోగలగుతాము. ముఖ్యంగా అందులో వున్న పాత్రలు మనకెంతో తోడ్పడుతాయి. బంధాలు, బంధువుల పట్ల ఎలా వ్యవహరించాలి... మన జీవితానికి సార్థకం ఏంటి..? అన్న వాటి గురించి క్లుప్తంగా విశదీకరిస్తుంది. ఆదికావ్యం రామాయణం, వాల్మీకి రామాయణాన్ని చదవడం ద్వారా మన దోషాలను నివారించుకుంటూ... శత్రువులను కూడా జయించవచ్చు. ఆటుపోట్లను ఎదుర్కుంటూ... విజయాలబాటవైపు అడుగులు వేయొచ్చు. పెళ్లయిన స్త్రీలు రామాయణాన్ని చదివినాగానీ, విన్నాగానీ వారికి రాముడువంటి మంచి కుమారుడు జన్మిస్తాడు. పెళ్లికాని కన్యలకు శ్రీరాముడు వంటి సద్గుణాలు కలిగిన మంచి భర్త లభిస్తాడు. రామాయణాన్ని నిత్యం పఠించడం ద్వారా మానవ శరీరంలో వున్న సమస్త రోగాలు తొలగిపోవడమే కాకుండా... ఆరోగ్యవంతుడిగా వెలుగుతాడు. మృత్యుదోషాలు తొలిగిపోయి, దీర్ఘాయుష్షును పొందుతాడు. అలాగే సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కూడా కలుగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిర్వహించుకునే ప్రతి కార్యక్రమంలోనూ మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతారు. అంతేకాదు... మానవ జీవితంలో అవసరమయ్యే విషయాలు అన్నీ సమకూరుతాయి.

పిట్ట చెప్పిన కథ.


ఇవి చైనా జానపద కథలు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా కథలోని నీతిని అవలీలగా గ్రహించేలా సులభశైలిలో రాసిన పుస్తకం ఇది. ఇందులో:
ప్రజల మనిషి
జిత్తులమారి నక్క
పిట్ట చెప్పిన కథలు
చిలుక గోరింక
పొడుగు జడ అమ్మాయి
మోలా
చిట్టితల్లి బుల్లిరాజు
కీలుగుర్రం
వలలో చిక్కిన నల్లదొంగ
నసీరుద్దీన్‌ చెప్పిన అల్లి బిల్లి కథలు
అనే కథలు ఉన్నాయి.
* * *
చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పోతున్న పిట్టవేపు తదేకంగా చూశాడు. రాజు ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు.
అవును.. ఎందుకిలా జరుగుతోంది? మూడుసార్లూ తనకి తాను కావాలనే చిక్కి ఆ మూడు కథల ద్వారా ఆ పిట్ట ఏ సందేశం ఇవ్వదలుచుకొంది?
వెంటనే రాజుకో విషయం బోధపడింది.
''ఇలాంటి అపురూపమైన వాటిని ఏ ఒక్కరూ తమ స్వార్థం కోసం స్వంతం చేసుకోకూడదన్న మాట!''
రాజుకి జ్ఞానోదయమైంది.
* * *
వినోదమూ, విజ్ఞానమూ పంచే కథలివి.
శివ