10, అక్టోబర్ 2014, శుక్రవారం
దేవుళ్లకు సంబంధించిన వాహనాలు
హిందూ సంస్కృతీ, సంప్రాదాయాల ప్రకారం ప్రాచీనకాలం నుండి కొన్ని జంతువులు, పక్షులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అదెలా అంటే... కొన్ని జంతువులు దేవుని రూపాలను కలిగి వుంటున్నాయి. మరికొన్ని జంతువులు, పక్షులు దేవుళ్లకు వాహనాలుగా వున్నాయి. ఇంకొన్ని సమయానుకూలంగా దేవుళ్లకు ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి.
వీటికి సంబంధించిన కొన్ని కథనాలు పురాణాలలో ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రకంగా చెప్పబడి వుంది కూడా!
ఉదాహరణకు ఏనుగు జంతువు గణేషుడు రూపాన్ని కలిగి వుంది. అదేవిధంగా కోతి కూడా హనుమంతుడి రూపాన్ని కలిగి వుంది. అలాగే ఎలుక వినాయకుడికి ఒక వాహనంగా ఉపయోగపడింది. ఇలా రకరకాల జంతువులు రకరకాలుగా దేవుళ్లకు అందుబాటులో వుండడం వల్ల వీటికి చాలా ప్రాధాన్యత వుంది.
హిందువులు జంతువులలో ఎంతో పవిత్రంగా, దైవంగా భావించే వాటిలో గోమాత ఒకటి. హిందూధర్మాల ప్రకారం పురాణాలలో గోమాత అన్ని దేవతలకు తల్లిగా భావిస్తారు. ఎవరైనా ఆవుపాలు దానం (గోదానం) చేస్తే.. ఆ కుటుంబంలో వున్నవారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పండితులు ఆ కాలంలోనే పేర్కొన్నారు.
కొన్ని దేవాలయాలలో ఈ జంతువుల బొమ్మలు కూడా చెక్కబడి వుంటాయి. సాధారణ మానవులకు ఇవి కేవలం జంతువులుగా మాత్రమే తెలుసు. అయితే వీటిని ఎదురించడం వల్ల మనం నిర్వహించుకునే కొన్ని కార్యాలయాలలో అపజయం ఎదుర్కోవడం ఖాయమని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ జంతువుల ప్రత్యేకతలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.....
ఎలుక : హిందు దేవుళ్లలో మొట్టమొదటగా ఆరాధించే దేవుడైన గణేషుడికి ఈ ఎలుక ఒక వాహనంలా ఉపయోగపడింది. అయితే ఇది వినాయకుని వాహనంగా పూజలు అందుకోవడం చాలా తక్కువ. చాలావరకు మానవులు దీనిని శత్రువుగా భావిస్తారు. ఎందుకంటే... ప్రస్తుతమున్న ఎలుకలు ఇంట్లో చాలా నష్టాలను కలిగిస్తున్నాయి కాబట్టి.
ఎద్దు : ఇది బసవన్న లేదా నందిగా పిలవబడుతుంది. ఈ జంతువు శివుడికి సంరక్షకుడిగా, వాహనంగా ప్రసిద్ధి చెందినది. ప్రతి శివాలయం దగ్గర ఈ నంది విగ్రహం కొలువై వుంటుంది.
పులి : హిందువులు ఎంతో ఆరాధ్యంగా, శక్తిగా, దుర్గగా పార్వతిదేవిని అర్చిస్తుంటారు. పులి పార్వతీదేవి వాహనం.
నెమలి : హిందూ మతంలో చదువుల తల్లిగా సరస్వతీ దేవి ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. సరస్వతీ హంస వాహనంపై, మయూర వాహనంపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. నెమలి యజ్ఞశక్తికి సంకేతం.
గుడ్లగూబ : హిందువుల సంప్రదాయం ప్రకారం సిరిసంపదలు, సౌభాగ్యం, సుఖసంతోషాలను కలుగజేసే లక్ష్మీమాతను ఎంతో దైవంగా ఆరాధిస్తారు. ఆ లక్ష్మీదేవి వాహనమే ఆ గుడ్లగూబ.
హంస : బ్రహ్మదేవుని వాహనమే ఈ హంస. ఈ హంసలో పాలుని, నీటిని వేరు చేసే గుణం వుంటుంది.
గరుడ (గ్రద్ద) : ఇది పక్షులన్నింటికీ అధిపతి. ఈ గద్దకు సంబంధించిన అష్టాదశ పురాణాలలో ఒకటైన గరుడ పురాణం కూడా వ్యాసమహర్షి చేత వ్రాయబడింది. ఇది శ్రీ మహావిష్ణువు వాహనం.
ఏనుగు : ఏనుగు ఇంద్రుడి వాహనం. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారాలను సూచిస్తుంది. గణేశుడు కూడా ఈ ఏనుగు రూపాన్నే ధరించాడు.
మొసలి : మొసలి వరణుడి వాహనం. వరుణుడిని నీటికి, ఆకాశానికి అధిపతిగా కొలిచేవారు.
గుర్రం : గుర్రం ఆది దేవుడు లేదా సూర్యదేవుని వాహనం. ఇది ఏడు ఇంద్రధనస్సు రంగులను సూచిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి