23, అక్టోబర్ 2014, గురువారం

దేవుడి మీద మీకున్న నమ్మకం ఏంటి?

మొత్తం ప్రపంచంలో జీవించే ప్రతిఒక్క జీవరాశికి కలిగే ఒక అసాధారణమైన ప్రశ్న..‘‘దేవుడు వున్నాడా? లేడా?’’. కొందరు దేవుడు వున్నాడని నమ్మి, ఆయనకు పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా రకరకాలైన ఆధ్మాత్మిక కార్యకలాపాలను నిర్వహించుకుంటారు. మరికొందరు దేవుడనేవాడు అస్సలు లేడని, జీవరాశి అనేది కేవలం ప్రకృతి రహస్యం అని అనుకుంటూ వుంటారు. మరికొంతమంది ఆనాటి కాలంలో ఎంతో ఆధ్యాత్మికంగా రూపొందించబడిన పురాణాలు, ఖురాన్ లు, బైబిలు, ఇంకా ఇతర దైవాలకు సంబంధించినవి కేవలం కట్టుకథలని, అవి కేవలం భ్రమ కలిగించడానికే రాయబడ్డారని అనుకునేవాళ్లూ వున్నారు. మరికొందరైతే.. సృష్టిలో నిర్మించబడ్డ ప్రతిఒక్క వస్తువు గురించి ఆలోచిస్తూ.. ‘‘ఇది ఎలా ఏర్పడింది? దీనికి సృష్టికర్త ఎవరు? ఇది పుట్టడానికి కారణమేంటి?’’ అనే ప్రశ్నలను వేసుకుంటూ దేవుడికి స్మరిస్తూ వుంటారు. అయితే ఇటువంటి ప్రశ్నలన్నింటినీ నిరూపించడానికి, రహస్యాలను ఛేదించడానికి ఎవ్వరి దగ్గర పరిశోధనాత్మకంగా కావలసిన మార్గాలు వుండవు... అస్సలు దొరకవు కూడా. మానవునిలో వుండే ఆత్మ, అది గ్రహించే శక్తి తయారుచేయడం సాధ్యం కాదు. అసలు అటువంటి ఆలోచనలు ఎవ్వరూ చేయలేరు కూడా. దేవుడు వున్నాడని చెప్పడానికి పరిశోధనలు చేయడం అవసరం లేదు... వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవడం అస్సలు అవసరం లేదు. మన చుట్టుపక్కల వున్న ప్రకృతిని, జీవరాసులను గ్రహిస్తే చాలు. దేవుడు విస్తృత సృష్టిలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్మించిన ఒక సుప్రీం అని ప్రతి ఒక్కరు నిర్వచిస్తారు. అతను నిర్మించిన మార్గాలన్నీ ఎంతో శక్తివంతమైనవి. అతనిని మాటలతో వివరించలేము. అతనిని అర్థం చేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో వున్న జీవరాసుల జీవితాలు సరిపోవు. దేవుడిని నమ్మేవారు ఆయన నిర్మించిన వాస్తవాలను నమ్ముతారు. నమ్మనివారు నిరూపించడానికి సాక్ష్యాన్ని కోరుకుంటారు. దేవుడు వున్నాడు అనే సాక్ష్యాన్ని ఇతరులను నిరూపించడం అసాధ్యం... అయితే దాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇందులో ఆ దేవుడు, అతని దైవం దాగి వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి