25, డిసెంబర్ 2014, గురువారం

Self Confidence


ఒకసారి ఎనిమిది వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగలి షాపుకు వెళతాడు. ఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి Count చెయ్యాలా, కత్తిరించాలా అంటాడు విసుగ్గా. 
అప్పుడాముసలి తాత ఠీవీగా అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ ఇలా అంటాడు 'రెండూ కాదు, కలరెయ్' 

20, డిసెంబర్ 2014, శనివారం









టెండర్


అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు.
ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400 డాలర్లు  పనివాళ్ళకు, 100 డాలర్లు  అతనికి లాభం.
తరువాత చైనీయుడి వంతు వచ్చింది. అతను కూడా ఏవో కొన్ని లెక్కలు వేసి 700 డాలర్లు లెక్క తేల్చాడు. 300డాలర్లు సామాగ్రికి, 300 పనివాళ్ళకు, 100 డాలర్లు లాభం.
చివరగా భారతీయుడి వంతు వచ్చింది. కొలతలు వేసే కార్యక్రమాలేమీ పెట్టుకోకుండా అధికార ప్రతినిథిని దగ్గరగా పిలిచి చెవిలో “2700 డాలర్లవుతుంది” అన్నాడు.
“నువ్వు వాళ్ళలాగా కనీసం కొలత కూడా వేయలేదు. అంత పెద్ద సంఖ్య ఎలా చెప్పావు?”
“1000 డాలర్లు నీకు , 1000 డాలర్లు నాకు, ఆ చైనా వాణ్ణి మనం పనిలో పెట్టుకుందాం. ఏమంటావ్?”
“Done”.

స్పేస్ షిప్

నాసా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన స్పేస్ షిప్ ని తయారు చేశారు. కానీ అంతరిక్షంలోకి పంపేందుకు ఆటంకం వచ్చింది. ఎంత ప్రయత్నించినా షటిల్ స్టార్ట్ అవ్వడంలేదు..
ఆఖరికి అక్కడ పనిచేస్తున్న జంబులింగం గారి పెద్దబ్బాయి సోమలింగం గారిని సహాయం చెయ్యమని అడిగారు.
సమస్యంతా విన్న సోమలింగం " షటిల్ ని 45 డిగ్రీల కోణంలో వంచి ప్రయోగించి చూడండి." అని సలహా ఇచ్చాడు. 
శాస్త్రవేత్తలు అలానే చేశారు.. అంతే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళిపోయింది. సైంటిస్టులు ఆనందం పట్టలేకపోయారు. 
"మీకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది." అని అడిగారు సోమలింగాన్ని .
"ఆ .. ఏముందీ.. మాదేశంలో స్కూటర్లు స్టార్ట్ కాకుంటే.. మావాళ్ళంతా చేసేది అదే కదా..!!" అసలు రహస్యం చెప్పాడు సోమలింగం. 

స్టెప్పు స్టెప్పుకు మార్కులు

క్లాసులో వార్షిక లెక్కల పరీక్ష జరుగుతోంది. రమేష్ మాటిమాటికి కూర్చున్న చోటినుంచి లేచి స్టెప్పులేసి
 కూర్చోవడం, ఏదో రాసి మళ్లీ లేచి స్టెప్స్ వేయడం తిరిగి కూర్చుని రాయడం చేస్తున్నాడు. ఇది గమనించిన
పరిశీలకుడు రమేష్‌ను లేపి మరీ ఎందుకలా గంతులేస్తున్నావు అని అడిగాడు.
'స్టెప్పు స్టెప్పుకు మార్కులుంటాయని ప్రశ్నాపత్రంలో ఇచ్చారు కద సార్' రొప్పుతూ అన్నాడు రమేష్

కాలేజ్ స్టూడెంట్స్

నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ అర్ద రాత్రి వరకు ఆడుకొని పరీక్షకు prepare అవకుండా పడుకుని తెల్లారి ఒక ఉపాయం ఆలోచిస్తారు.
తమ బట్టలకు బాగా దుమ్ము, గ్రీజు అంటించుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూండగా కారు పంక్చరైంది దాన్ని తోసుకుని హాస్టల్ కి వచ్చేసరికి తెల్లారింది. అందుకే చదవలేకపోయామని చెప్తారు.

ప్రిన్సిపాల్ సరే అని మూడు రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెడతానంటాడు. మూడురోజుల తర్వాత ఆ నలుగురిని తలా ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళకు Test పేపర్ ఇస్తారు.

ప్రశ్నా పత్రం
పరీక్ష ప్రశ్నా పత్రంలో వందమార్కులకు రెండు సమాధానాలు వ్రాయలి.

Q.1. నీ పేరు......................... (2 MARKS)

Q.2. కారు ఏ టైరు పంక్చరైంది? (98 మార్కులు)

a) Front Left b) Front Right
c) Back Left d) Back Right.....!!!

పెళ్ళికొడుకు

"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.
"నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.

సింహం

Employee : సార్ మీరు మన ఆఫీస్ లో సింహం కదా, మరి ఇంట్లో ఎలా ఉంటారు, 
బాస్ : భలేవాడివే నేను ఇంట్లోనూ సింహంలానే ఉంటాను, కానీ దుర్గామాత సింహం మీద కూర్చొనుంటుందక్కడ.

వంట

భార్యా భర్తలు ఒక సారి డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, సెర్వ్ చెయ్యడం అవ్వగానే భర్త వెంటనే ' వావ్, నోరూరుతోంది, పట్టు మొదలెడదాం' అంటాడు, 
భార్య: హనీ, నువ్వు తినేముంది ప్రేయర్ చేస్తావుగా, మర్చిపోయావా? 
భర్త : అది మనిల్లు డార్లింగ్, ఇక్కడ చెఫ్ కి ఎలా వండాలో తెలుసు 

   


రంగాపురంలో యాదయ్య అనే బిచ్చగాడు ఒకడు ఉండేవాడు. పని చేసి డబ్బు సంపాదించుకునేందుకు శక్తి ఉన్నా, ఊరికే అందరినీ అడుక్కొని డబ్బు సంపాదించుకునేవాడు అతను. "కష్టపడి డబ్బు సంపాదించుకోవచ్చుకదా?" అని ఎవరైనా అతనిని అడిగితే, "నా కష్టాలేవో నేను పడతాను నీకెందుకు?" అని పొగరుగా సమాధానమిచ్చేవాడు. 

ఆ ఊరిలోనే సౌజన్య అనే అమ్మాయి ఉండేది. తను చాలా తెలివైనది. యాదయ్య తీరును గమనించిన సౌజన్య, అతనితో ఎలాగైనా మార్పు తేవాలనుకొని, ఆలోచించింది. తనకొక పథకం తట్టింది.
ఒకరోజు యాదయ్య బిక్షాటన చేస్తుండగా, సౌజన్య అతనిని పిలిచి "ఒక్కసారిగా ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీకు ఒక్కసారిగా ధనవంతుడివి కావాలని లేదా?" అని అడిగింది.
"ఎందుకు లేదు?" అన్నాడు యాదయ్య, కొంత తడబడుతూ. మరైతే "నువ్వు జామకాయ వ్రతం చేయాలి" చెప్పింది సౌజన్య. యాదయ్య తెల్లమొహం వేశాడు-"జామకాయ వ్రతమా?! దాన్ని ఎలా చేయాలి?" అని.

"అదేమంత కష్టమైన వ్రతం కాదులే, నువ్వు సులభంగానే చెయ్యగలవు. వ్రతం చెయ్యాలనుకునేవాళ్ళు ముందు ఒక మూట జామకాయలు కొనాలి. ఒక్కో జామపండును రెండు రూపాయలకు ఒక్క పైసా తగ్గించకుండా అమ్మాలి. ఇలా వరసగా పదిహేను సార్లు చెయ్యాలి. ఇలా వచ్చిన డబ్బులను మితంగా, అవసరమైనంత వాడుకోవచ్చు కూడా. ఇంకేమి, మిగిలిన డబ్బులను దాచుకుంటే సరి. ఎంత డబ్బును దాచుకుంటే అంత ధనవంతుడివి అవుతావు నువ్వు!" చెప్పింది సౌజన్య ఉత్సాహంగా.

యాదయ్య తన దగ్గర మూట జామకాయలు కొనడానికి డబ్బులు లేవన్నాడు. "అయ్యో! సొంత డబ్బులు వాడుకోకపోతే వ్రతం ఫలించదే?! మొదటిసారి జామకాయలకోసం నీ ఇంట్లో ఉన్న పైసా పైసా వాడుకుంటే తప్ప ప్రయోజనం‌ ఉండదు. నేనేమీ చెయ్యలేను" అన్నది సౌజన్య.
"సరే, చూస్తానులే. ఇంట్లో అంతా వెతికితే ఒక మూటకు సరిపడా డబ్బులు దొరక్కపోవు" అన్నాడు యాదయ్య కొంచెం‌ ఆలోచించి.
మరునాడే అతను జామకాయల మూటను కొని, సౌజన్య చెప్పినట్లు, చక్కగా అమ్ముకున్నాడు. సౌజన్య కూడా వాళ్ల అమ్మా నాన్నలిచ్చిన డబ్బుతో అతని దగ్గర కొన్ని జామకాయలు కొనుక్కున్నది. అట్లా వరసగా పదిహేను రోజుల పాటు జామకాయలు అమ్మాడు యాదయ్య.
వ్రతం అయిపోయాక చూస్తే, ఆశ్చర్యం! యాదయ్య దగ్గర చాలా డబ్బు ఉన్నది! అతను సౌజన్య దగ్గరకు వెళ్ళి, సంతోషంగా "నీ వల్లే నాకు ఈ వ్రతం గురించి తెలిసింది. ఇందులో కొంత డబ్బు నువ్వు తీసుకో!" అన్నాడు. సౌజన్య అప్పుడు నవ్వుతూ "నిజానికి జామకాయ వ్రతం అనేది ఏదీ లేదు యాదయ్యా! 'ఊరికే అడుక్కుని బ్రతుక్కోవచ్చు' అనే నీ ఆలోచనలో మార్పు తెచ్చేందుకే ఇలా చేశాను. కష్టపడి పనిచేసి బ్రతకటంలోని సంతోషం ఇప్పుడు నీ అనుభవంలోకి వచ్చింది కదా, అది చాలు నాకు" అన్నది.
శ్రమశక్తితో సంపాదించిన డబ్బు విలువను రుచి చూసిన యాదయ్య ఇక ఆ రోజునుండీ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించటమే కాదు; వాటిని పొదుపుగా వాడుకొని, చూస్తుండగానే తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. సుఖంగా జీవించాడు.

16, డిసెంబర్ 2014, మంగళవారం

అన్నపూర్ణాస్తోత్రం............




నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౧ ||
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౨ ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౩ ||
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౪ ||
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౫ ||
ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౬ ||
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౭ ||
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౮ ||
చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౯ ||
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||

కనకధారాస్తోత్రం



వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సింధురాననం ||
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ - భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా - మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః || ౧ ||
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః - ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా - సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః || ౨ ||
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం - ఆనందహేతురధికం మురవిద్విషోzపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం - ఇందీవరోదరసహోదరమిందిరాయాః || ౩ ||
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానందకందమనిమేషమనంగతంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం - భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః || ౪ ||
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా - హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతోzపి కటాక్షమాలా - కళ్యాణమావహతు మే కమలాలయాయాః || ౫ ||
కాలాంబుదాళిలలితోరసి కైటభారేః - ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః - భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ - మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం - మందాలసం చ మకరాలయకన్యకాయాః || ౭ ||
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం - నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||
ఇష్టా విశిష్టమతయోzపి యయా దయార్ద్ర - దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం - పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః || ౯ ||
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి - శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై - తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై || ౧౦ ||
శ్రుత్యై నమోzస్తు శుభకర్మఫలప్రసూత్యై - రత్యై నమోzస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోzస్తు శతపత్రనికేతనాయై - పుష్ట్యై నమోzస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||
నమోzస్తు నాళీకనిభాననాయై - నమోzస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై |
నమోzస్తు సోమామృతసోదరాయై - నమోzస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||
నమోzస్తు హేమాంబుజపీఠికాయై - నమోzస్తు భూమండలనాయికాయై |
నమోzస్తు దేవాదిదయాపరాయై - నమోzస్తు శార్ఙ్గాయుధవల్లభాయై || ౧౩ ||
నమోzస్తు దేవ్యై భృగునందనాయై - నమోzస్తు విష్ణోరురసిస్థితాయై |
నమోzస్తు లక్ష్మ్యై కమలాలయాయై - నమోzస్తు దామోదరవల్లభాయై || ౧౪ ||
నమోzస్తు కాంత్యై కమలేక్షణాయై - నమోzస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమోzస్తు దేవాదిభిరర్చితాయై - నమోzస్తు నందాత్మజవల్లభాయై || ౧౫ ||
సంపత్కరాణి సకలేంద్రియనందనాని - సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని - మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || ౧౬ ||
యత్కటాక్షసముపాసనావిధిః - సేవకస్య సకలార్థసంపదః |
సంతనోతి వచనాంగమానసైః - త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౭ ||
సరసిజనయనే సరోజహస్తే - ధవళతమాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే - త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౮ ||
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట - స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష - లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || ౧౯ ||
కమలే కమలాక్షవల్లభే త్వం - కరుణాపూరతరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం - ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః || ౨౦ ||
దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః - కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ - ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || ౨౧ ||
స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం - త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో - భవంతి తే భువి బుధభావితాశయాః || ౨౨ ||

15, డిసెంబర్ 2014, సోమవారం

కార్తీక పురాణము 29వ అధ్యాయము........



అంబరీషుడు దూర్వాసుని పూజించుట - ద్వాదశీ పారణము

అత్రి మహాముని అగస్త్యులవారితో యీవిధముగా - సుదర్శనచక్రము అంబరీషునకభయమిచ్చి వుభయులను రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్థానమైన వైనము చెప్పి - తిరిగి యిట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్యగృహస్తుడను. నాశక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును, ద్వాదశీ వ్రతము జేసుకొనుచు ప్రజలకు యెట్టి కీడు రాకూండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీయెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా ఆతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్ధుని చేయుడు. మీరు దయార్ధ్ర హృదయులు, ప్రధమకోపముతో నన్ను శపించినను మరల నాగృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచుభాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నానోట పలుకులు రాకున్నవి. నాకండ్ల వెంటవచ్చు అనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నరజన్మ రాకూండా వుండేటట్లును, సదా మీబోటి మునిశ్రేష్టుల యందును - ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు" డని ప్రార్థించి, సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, యెవరు శత్రువులకైనను శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి. నీవు నాకు యుష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నాకంటె చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన యీ స్వల్పకోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశీ వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక మరొకటి యగునా?" అని దూర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసింcచి,అంబరీషుని దీవించి, సెలవుపొంది తన ఆశ్రమమునకు వెళ్లెను.

ఈ వృత్తాంతమంతయు కార్తీకశుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజునకంతటి శ్రేష్టతయు, మహిమయు గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి అ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణచేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలదీ శ్రీమన్నారాయణుని ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాని సర్వపాపములు యీవ్రత ప్రభావము వలన పటాపంచలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను, ఆ ఘడియలు దాటకుండగనే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిరనివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టివారు ఏకాదశీ వ్రతము, ద్వాదశీ వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీకశుద్ధ ద్వాదశి అన్నివిధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱిచెట్టు విత్తనము చాలా చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీకమాసములో నియమానుసారముగ జేసిన యే కొంచెము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలేగాక సమస్తమానవులూ తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించిరి.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము
ఇరవై తొమ్మొదో రోజు పారాయణము సమాప్తము.

‘’శివాలయ దర్శన విధానం”



సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంల
ో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.


అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..

ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...

మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.

5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.

ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...

శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..

క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.

శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"


23, అక్టోబర్ 2014, గురువారం

దేవుడి మీద మీకున్న నమ్మకం ఏంటి?

మొత్తం ప్రపంచంలో జీవించే ప్రతిఒక్క జీవరాశికి కలిగే ఒక అసాధారణమైన ప్రశ్న..‘‘దేవుడు వున్నాడా? లేడా?’’. కొందరు దేవుడు వున్నాడని నమ్మి, ఆయనకు పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా రకరకాలైన ఆధ్మాత్మిక కార్యకలాపాలను నిర్వహించుకుంటారు. మరికొందరు దేవుడనేవాడు అస్సలు లేడని, జీవరాశి అనేది కేవలం ప్రకృతి రహస్యం అని అనుకుంటూ వుంటారు. మరికొంతమంది ఆనాటి కాలంలో ఎంతో ఆధ్యాత్మికంగా రూపొందించబడిన పురాణాలు, ఖురాన్ లు, బైబిలు, ఇంకా ఇతర దైవాలకు సంబంధించినవి కేవలం కట్టుకథలని, అవి కేవలం భ్రమ కలిగించడానికే రాయబడ్డారని అనుకునేవాళ్లూ వున్నారు. మరికొందరైతే.. సృష్టిలో నిర్మించబడ్డ ప్రతిఒక్క వస్తువు గురించి ఆలోచిస్తూ.. ‘‘ఇది ఎలా ఏర్పడింది? దీనికి సృష్టికర్త ఎవరు? ఇది పుట్టడానికి కారణమేంటి?’’ అనే ప్రశ్నలను వేసుకుంటూ దేవుడికి స్మరిస్తూ వుంటారు. అయితే ఇటువంటి ప్రశ్నలన్నింటినీ నిరూపించడానికి, రహస్యాలను ఛేదించడానికి ఎవ్వరి దగ్గర పరిశోధనాత్మకంగా కావలసిన మార్గాలు వుండవు... అస్సలు దొరకవు కూడా. మానవునిలో వుండే ఆత్మ, అది గ్రహించే శక్తి తయారుచేయడం సాధ్యం కాదు. అసలు అటువంటి ఆలోచనలు ఎవ్వరూ చేయలేరు కూడా. దేవుడు వున్నాడని చెప్పడానికి పరిశోధనలు చేయడం అవసరం లేదు... వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవడం అస్సలు అవసరం లేదు. మన చుట్టుపక్కల వున్న ప్రకృతిని, జీవరాసులను గ్రహిస్తే చాలు. దేవుడు విస్తృత సృష్టిలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్మించిన ఒక సుప్రీం అని ప్రతి ఒక్కరు నిర్వచిస్తారు. అతను నిర్మించిన మార్గాలన్నీ ఎంతో శక్తివంతమైనవి. అతనిని మాటలతో వివరించలేము. అతనిని అర్థం చేసుకోవడానికి మొత్తం ప్రపంచంలో వున్న జీవరాసుల జీవితాలు సరిపోవు. దేవుడిని నమ్మేవారు ఆయన నిర్మించిన వాస్తవాలను నమ్ముతారు. నమ్మనివారు నిరూపించడానికి సాక్ష్యాన్ని కోరుకుంటారు. దేవుడు వున్నాడు అనే సాక్ష్యాన్ని ఇతరులను నిరూపించడం అసాధ్యం... అయితే దాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇందులో ఆ దేవుడు, అతని దైవం దాగి వుంది.

12, అక్టోబర్ 2014, ఆదివారం

అలంపూర్ జోగులాంల అమ్మవారి ఆలయం


ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఈ జోగులాంబ దేవాలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన వెలిసిన ఈ జోగులాంబ దేవాలయం నిత్యం భక్తులకు కరుణా కటాక్షాలు చూపుతూ పూజలందుకుంటున్న ఈ దేవాలయం గురించి...

ఆలయ చరిత్ర

క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.

ఆలయ స్థల పురాణం

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది.

ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.

పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.

hai friends.............................







jai sri ram.............


10, అక్టోబర్ 2014, శుక్రవారం

దేవుళ్లకు సంబంధించిన వాహనాలు

హిందూ సంస్కృతీ, సంప్రాదాయాల ప్రకారం ప్రాచీనకాలం నుండి కొన్ని జంతువులు, పక్షులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అదెలా అంటే... కొన్ని జంతువులు దేవుని రూపాలను కలిగి వుంటున్నాయి. మరికొన్ని జంతువులు, పక్షులు దేవుళ్లకు వాహనాలుగా వున్నాయి. ఇంకొన్ని సమయానుకూలంగా దేవుళ్లకు ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. వీటికి సంబంధించిన కొన్ని కథనాలు పురాణాలలో ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క రకంగా చెప్పబడి వుంది కూడా! ఉదాహరణకు ఏనుగు జంతువు గణేషుడు రూపాన్ని కలిగి వుంది. అదేవిధంగా కోతి కూడా హనుమంతుడి రూపాన్ని కలిగి వుంది. అలాగే ఎలుక వినాయకుడికి ఒక వాహనంగా ఉపయోగపడింది. ఇలా రకరకాల జంతువులు రకరకాలుగా దేవుళ్లకు అందుబాటులో వుండడం వల్ల వీటికి చాలా ప్రాధాన్యత వుంది. హిందువులు జంతువులలో ఎంతో పవిత్రంగా, దైవంగా భావించే వాటిలో గోమాత ఒకటి. హిందూధర్మాల ప్రకారం పురాణాలలో గోమాత అన్ని దేవతలకు తల్లిగా భావిస్తారు. ఎవరైనా ఆవుపాలు దానం (గోదానం) చేస్తే.. ఆ కుటుంబంలో వున్నవారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పండితులు ఆ కాలంలోనే పేర్కొన్నారు. కొన్ని దేవాలయాలలో ఈ జంతువుల బొమ్మలు కూడా చెక్కబడి వుంటాయి. సాధారణ మానవులకు ఇవి కేవలం జంతువులుగా మాత్రమే తెలుసు. అయితే వీటిని ఎదురించడం వల్ల మనం నిర్వహించుకునే కొన్ని కార్యాలయాలలో అపజయం ఎదుర్కోవడం ఖాయమని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ జంతువుల ప్రత్యేకతలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..... ఎలుక : హిందు దేవుళ్లలో మొట్టమొదటగా ఆరాధించే దేవుడైన గణేషుడికి ఈ ఎలుక ఒక వాహనంలా ఉపయోగపడింది. అయితే ఇది వినాయకుని వాహనంగా పూజలు అందుకోవడం చాలా తక్కువ. చాలావరకు మానవులు దీనిని శత్రువుగా భావిస్తారు. ఎందుకంటే... ప్రస్తుతమున్న ఎలుకలు ఇంట్లో చాలా నష్టాలను కలిగిస్తున్నాయి కాబట్టి. ఎద్దు : ఇది బసవన్న లేదా నందిగా పిలవబడుతుంది. ఈ జంతువు శివుడికి సంరక్షకుడిగా, వాహనంగా ప్రసిద్ధి చెందినది. ప్రతి శివాలయం దగ్గర ఈ నంది విగ్రహం కొలువై వుంటుంది. పులి : హిందువులు ఎంతో ఆరాధ్యంగా, శక్తిగా, దుర్గగా పార్వతిదేవిని అర్చిస్తుంటారు. పులి పార్వతీదేవి వాహనం. నెమలి : హిందూ మతంలో చదువుల తల్లిగా సరస్వతీ దేవి ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. సరస్వతీ హంస వాహనంపై, మయూర వాహనంపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. నెమలి యజ్ఞశక్తికి సంకేతం. గుడ్లగూబ : హిందువుల సంప్రదాయం ప్రకారం సిరిసంపదలు, సౌభాగ్యం, సుఖసంతోషాలను కలుగజేసే లక్ష్మీమాతను ఎంతో దైవంగా ఆరాధిస్తారు. ఆ లక్ష్మీదేవి వాహనమే ఆ గుడ్లగూబ. హంస : బ్రహ్మదేవుని వాహనమే ఈ హంస. ఈ హంసలో పాలుని, నీటిని వేరు చేసే గుణం వుంటుంది. గరుడ (గ్రద్ద) : ఇది పక్షులన్నింటికీ అధిపతి. ఈ గద్దకు సంబంధించిన అష్టాదశ పురాణాలలో ఒకటైన గరుడ పురాణం కూడా వ్యాసమహర్షి చేత వ్రాయబడింది. ఇది శ్రీ మహావిష్ణువు వాహనం. ఏనుగు : ఏనుగు ఇంద్రుడి వాహనం. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారాలను సూచిస్తుంది. గణేశుడు కూడా ఈ ఏనుగు రూపాన్నే ధరించాడు. మొసలి : మొసలి వరణుడి వాహనం. వరుణుడిని నీటికి, ఆకాశానికి అధిపతిగా కొలిచేవారు. గుర్రం : గుర్రం ఆది దేవుడు లేదా సూర్యదేవుని వాహనం. ఇది ఏడు ఇంద్రధనస్సు రంగులను సూచిస్తుంది.

రామాయణం పఠించడం వల్ల కలిగే లాభాలు

ప్రాచీనకాలంలో దేవతల జీవన విధానం, వారు అనుసరించిన పద్ధతులకు సంబంధించిన పవిత్ర పురాణ గ్రంథాలు ఎన్నో వున్నాయి. వాటిని పఠించడంగానీ, వినడంగానీ చేస్తే... మన సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా... జీవితంలో వున్న కష్టాలు తొలగిపోయి, లాభాల పంటలు పండుతాయని ఆనాటి ఋషువులు పేర్కొన్నారు. అటువంటి పవిత్ర గ్రంథాల్లో వాల్మీకి రచించిన రామాయణం ఎంతో మహోన్నతమైంది. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం... హిందూ చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగి వుంది. అందులో వున్న పాత్రల ద్వారా మంచి-చెడు మధ్య భేదాలు, ఆదర్శ జీవిన విధానం, గౌరవ-అగౌరవాలు వంటి విషయాలను ఎన్నో నేర్చుకోగలగుతాము. ముఖ్యంగా అందులో వున్న పాత్రలు మనకెంతో తోడ్పడుతాయి. బంధాలు, బంధువుల పట్ల ఎలా వ్యవహరించాలి... మన జీవితానికి సార్థకం ఏంటి..? అన్న వాటి గురించి క్లుప్తంగా విశదీకరిస్తుంది. ఆదికావ్యం రామాయణం, వాల్మీకి రామాయణాన్ని చదవడం ద్వారా మన దోషాలను నివారించుకుంటూ... శత్రువులను కూడా జయించవచ్చు. ఆటుపోట్లను ఎదుర్కుంటూ... విజయాలబాటవైపు అడుగులు వేయొచ్చు. పెళ్లయిన స్త్రీలు రామాయణాన్ని చదివినాగానీ, విన్నాగానీ వారికి రాముడువంటి మంచి కుమారుడు జన్మిస్తాడు. పెళ్లికాని కన్యలకు శ్రీరాముడు వంటి సద్గుణాలు కలిగిన మంచి భర్త లభిస్తాడు. రామాయణాన్ని నిత్యం పఠించడం ద్వారా మానవ శరీరంలో వున్న సమస్త రోగాలు తొలగిపోవడమే కాకుండా... ఆరోగ్యవంతుడిగా వెలుగుతాడు. మృత్యుదోషాలు తొలిగిపోయి, దీర్ఘాయుష్షును పొందుతాడు. అలాగే సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కూడా కలుగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిర్వహించుకునే ప్రతి కార్యక్రమంలోనూ మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతారు. అంతేకాదు... మానవ జీవితంలో అవసరమయ్యే విషయాలు అన్నీ సమకూరుతాయి.

పిట్ట చెప్పిన కథ.


ఇవి చైనా జానపద కథలు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా కథలోని నీతిని అవలీలగా గ్రహించేలా సులభశైలిలో రాసిన పుస్తకం ఇది. ఇందులో:
ప్రజల మనిషి
జిత్తులమారి నక్క
పిట్ట చెప్పిన కథలు
చిలుక గోరింక
పొడుగు జడ అమ్మాయి
మోలా
చిట్టితల్లి బుల్లిరాజు
కీలుగుర్రం
వలలో చిక్కిన నల్లదొంగ
నసీరుద్దీన్‌ చెప్పిన అల్లి బిల్లి కథలు
అనే కథలు ఉన్నాయి.
* * *
చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పోతున్న పిట్టవేపు తదేకంగా చూశాడు. రాజు ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు.
అవును.. ఎందుకిలా జరుగుతోంది? మూడుసార్లూ తనకి తాను కావాలనే చిక్కి ఆ మూడు కథల ద్వారా ఆ పిట్ట ఏ సందేశం ఇవ్వదలుచుకొంది?
వెంటనే రాజుకో విషయం బోధపడింది.
''ఇలాంటి అపురూపమైన వాటిని ఏ ఒక్కరూ తమ స్వార్థం కోసం స్వంతం చేసుకోకూడదన్న మాట!''
రాజుకి జ్ఞానోదయమైంది.
* * *
వినోదమూ, విజ్ఞానమూ పంచే కథలివి.
శివ